logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

తెలంగాణలో వణికిస్తున్న చలి.. పెరుగుతున్న కరోనా కేసులు!

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈశాన్యగాలులు, అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా చలి క్రమంగా పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. తాజాగా కరోనా కేసులను పరిశీలిస్తే.. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కేసులు ఇప్పుడు చలి కారణంగా మరోసారి వెయ్యికి పైగా నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 1,050 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,56,713కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4 కు చేరినట్టుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉండటం ఊరటనిస్తుంది. నిన్న ఒక్క రోజే 1,736 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,404 గా ఉంది. వారిలో 13,867 మంది ఇంటి వద్దనే ఐసోలేషన్లో ఉండి కోలుకున్నట్టుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Related News