కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా కరోనా మళ్ళీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,624 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య కోటి ముప్పై వేలు దాటింది. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఒక్క రోజులో 341 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు ఉన్న కరోనా మరణాల సంఖ్య 1,45,477 కు చేరింది.
శనివారం ఒక్కరోజే 29,690 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 95,80,402 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,05,344 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.51గా ఉంది. మరణాల రేటు 1.45కు తగ్గగా యాక్టివ్ కేసుల శాతం 3.04గా ఉంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 592 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,414కు కు చేరింది. ముగ్గురు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి మరణించిన వారి సంఖ్య 1,513 గా ఉంది. ప్రస్తుతం 6,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి నిన్న 643 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున బాధితుల సంఖ్య 2,73,013కు చేరినట్టుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. .