logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

తెలంగాణలో కరోనా సరికొత్త రికార్డు.. టాప్ లో ఆ ఐదు జిల్లాలు!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు మార్కును దాటాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక్క రోజులో కరోనాతో 11 మరణించారు.

తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 64,786 కు చేరింది. అదే విధంగా మరణించిన వారి సంఖ్య 530 కు పెరిగింది. అదే సమయంలో నిన్న ఒక్క రోజే 1114 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనా భారిన పడి కోలుకున్న వారి సంఖ్య 46,502గా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 17,754. వీరిలో 11,359 మందిని హోమ్ ఐసోలేషన్, ఇతర ఐసోలేషన్ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా నమోదైన 2,083 కరోనా పాజిటివ్ కేసులలో మరోసారి హైదరాబాద్ టాప్ లో నిలిచింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 578, రంగారెడ్డి ప్రాంతంలో 228, వరంగల్ అర్బన్ లో 134, కరీంనగర్ లో 108, సంగారెడ్డి లో 101 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Related News