logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

క‌రోనా బులెటిన్‌‌‌: ఏపీలో మెరుగ‌వుతున్న ప‌రిస్థితి.. పెరిగిన రిక‌వ‌రీ రేటు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుముఖ ప‌డుతోంది. గ‌త 15 రోజులుగా ప్ర‌తీ రోజు 60 – 90 మ‌ధ్య‌లో న‌మోదైనా క‌రోనా పాజిటీవ్ కేసులు ఇప్పుడు త‌గ్గుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో 7,409 క‌రోనా పరీక్ష‌లు జ‌ర‌ప‌గా కొత్త‌గా 38 మందికి క‌రోనా పాజిటీవ్ ఉన్న‌ట్లు తేలింది. మ‌రోవైపు రిక‌వ‌రీ రేటు కూడా రాష్ట్రంలో పెరుగుతోంది. నిన్న ఒక్క‌రోజే 73 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 2018 పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా 998 మంది డిశ్చార్జ్ అయ్యారు. 45 మంది మ‌ర‌ణించ‌గా ప్ర‌స్తుతం 975 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

గ‌త 24 గంట‌ల్లో చిత్తూరులో 9 కేసులు న‌మోదు కాగా, వీటిలో ఎనిమిది కేసులు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న కేసులు. క‌ర్నూలులో 9, అనంత‌పురం జిల్లాలో 8, గుంటూరులో 5, కృష్ణా జిల్లాలో 3, విశాఖ‌ప‌ట్నంలో 3, నెల్లూరు జిల్లాలో 1 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి.

Related News