logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

బ్రేకింగ్: తెలంగాణలో వచ్చిన వారికే మళ్ళీ కరోనా వైరస్.. ప్రభుత్వం కీలక ప్రకటన

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణకు చెందిన యువకుడికి కరోనా సోకి నెగిటివ్ వచ్చిన కొంత కాలం వ్యవధిలో ఈ వైరస్ మళ్ళీ వ్యాపించిందని, తాజాగా జరిపిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందని ప్రభుత్వం షాకింగ్ వార్తను వినిపించింది. కరోనా వైరస్ రెండవసారి వస్తుందా? వస్తే దాని పరిణాలు ఎలా ఉంటాయి? అనే విషయాలపై ప్రజలకు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

కాగా ఇలాంటి తరహా కేసులు చైనాలో నమోదైనట్టుగా ప్రచారం జరిగింది. ఇటీవల హాంకాంగ్ కు చెందిన టెకీకి ప్రపంచంలోనే తొలిసారిగా రెండవసారి కరోనా సోకింది. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వం వెల్లడించడంతో ఇప్పుడు ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ కేసులను ప్రత్యేకంగా పరీశీలిస్తున్నట్టుగా తెలిపింది. ఇప్పటివరకు ఒకసారి కరోనా శరీరంపై దాడి చేస్తే శరీరంలోని యాంటీ బాడీల కారణంగా మళ్ళీ ఆ వైరస్ సోకదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ యువకుడికి రెండోసారో కరోనా పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. అయితే కొన్ని కేసుల్లో వైరస్ 14 రోజులు ప్రభావం చూపితే మరికొన్ని కేసుల్లో ఒక నెల రోజుల వ్యవధి వరకు ఉంటుంది. అయితే డబ్ల్యూహెచ్వో తెలిపిన వివరాల ప్రకారం కరోనా వ్యక్తుల శరీరంలోకి ప్రవేశించిన 10 రోజుల తర్వాత అంతగా ప్రబుభవం చూపలేదని పేర్కొంది. తాజాగా రాష్ట్రంలో నమోదైన కేసును వివరించిన అధికారులు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేశారు.

మొదటి సారి ఈ వైరస్ అటాక్ చేసినప్పుడు ఉన్నంత ప్రభావం రెండవసారి లేదని తెలిపారు. కానీ ఈ వార్తతో ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు వైరస్ రాని వారు మాత్రమే జాగ్రత్తగా ఉంటున్నారు. ఇపుడు వైరస్ వచ్చి వెళ్లిన వ్యక్తులు కూడా మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.

Related News