logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

కరోనా అలర్ట్: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి డేంజర్!

కరోనా వైరస్ శరీరంలో నుంచి పూర్తిగా తొలగిపోదని కోలుకున్న వారిలో మళ్ళీ ఈ వైరస్ తిరగబెడుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే కరోనా హృద్రోగులు, అధిక రక్త పోటు సమస్యలు ఉన్న వారిలో కూడా ఈ మహమ్మారి ప్రభావం పూర్తిగా తొలగడం లేదని వెల్లడించారు. చైనాలోని హుహాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు తేలాయి.

వుహాన్‌లోని కేంద్ర ఆసుపత్రిలో 938 మంది కోవిడ్ రోగుల వివరాలను పరీక్షించిన అనంతరం ఈ విషయాన్నీ వెల్లడించారు. అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యలతో బాధపడుతూ కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారిలో 58 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. డిశ్చార్జ్ అయిన తర్వాత 44 రోజుల వరకు వైరస్ ఆర్ఎన్ఏ వారి శరీరంలో ఉన్నట్టు గుర్తించారు. కరోనా ముఖ్యంగా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకుని పైన సూచించిన ఆరోగ్య సమస్యలు ఉన్న వారి ఊపిరితిత్తుల్లోని లోపలి భాగాల్లో ఈ వైరస్ తాలుకా ఆనవాళ్లు అతుక్కుని ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Related News