logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

చిరంజీవి కూతురు డేరింగ్ స్టెప్.. వివాదంలో ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడటం, వాటి స్థానంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగటం చూస్తూనే ఉన్నాం. దీంతో సుస్మిత కూడా భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపుట్టింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థను స్థాపించి నిర్మాతగా మారింది. ప్రస్తుతం ఆమె ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ నిర్మిస్తుంది.

ఇది జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. ‘ఓయ్’ ఫెమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. ఇప్పటికే షూట్ అవుట్ ఎట్ ఆలేరు ప్రోమోలు విడుదలయ్యి ఆసక్తిని పెంచేసాయి. ఈ సిరీస్ కు సంబందించిన ప్రమోషన్ పనులను కూడా మొదలు పెట్టిన సుస్మిత అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది. ఆమె నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ 2015 ఏప్రిల్ 7 న ఆలేరులో జరిగిన వికారుద్దీన్ ఎంకౌంటర్ నేపథ్యం లో సాగుతుంది.

అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. ఆలేరు సమీపంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది వికారుద్దీన్ తో సహా మరో ఐదుగురు సభ్యులు హతమయ్యారు. విచారణ కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఎంకౌంటర్ జరగగా ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని, మానవ హక్కులను ఉల్లంఘించడమే అంటూ వికారుద్దీన్ తండ్రి హై కోర్టును ఆశ్రయించాడు. ఆ సమయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను తరలిస్తున్న సమయంలో వ్యాన్ ఆలేరు సమీపంలోకి రాగానే వికారుద్దీన్ అనుచరులే పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసారు.

ఈ క్రమంలో ఎన్ కౌంటర్ జరిగినట్టుగా గతంలో పేర్కొన్నారు. వికారుద్దీన్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, హోమ్ గార్డు హత్య కేసులో ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. ఈ విచారణ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఎంకౌంటర్ నేపథ్యంలో వెబ్ సిరీస్ తెరకెక్కుతుండటంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ రాజకీయ పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) పార్టీ నేత అంజాదుల్లా ఖాన్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ లో ఎన్ కౌంటర్ లో హతమైన నిందితులందరినీ దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

దర్శక నిర్మాతలు కనీసం నిందితుల కుటుంబాలను కలవలేదని, వారి అనుమతి లేకుండానే దీనిని తెరకెక్కిస్తున్నారన్నారు. ఈ సిరీస్ పేరుతో పోలీసులను హీరోలుగా చూపిస్తే తాము కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన ప్రోమోలను నిలిపివేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్, హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వివాదాస్పత కథతో డేరింగ్ స్టెప్ తీసుకున్న సుస్మిత ఇపుడు ఈ కాంట్రావర్సీ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News