logo

  BREAKING NEWS

బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |  

హీరోయిన్‌లా క‌నిపించే ఈ లిప్‌స్టిక్ మాత క‌థ విన్నారా..?

ఆమె ఓ స‌న్యాసి. త‌న‌ను తాను మాత‌గా చెప్పుకుంటారు. చేతిలో త్రిషూలం, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, ఎర్ర‌టి వ‌స్త్రాల‌తో నిత్యంత క‌నిపిస్తుంటారు. కానీ, ఆమెపై అనేక వివాదాలు ఉన్నాయి. అస‌లు ఆమె స‌న్యాసి, సాధువు కాదంటారు కొంద‌రు. భార‌త్‌లో సాధువులా ద‌ర్శ‌న‌మిచ్చే ఆమె విదేశాల్లో మోడ్ర‌న్ డ్రెస్సుల్లో క‌నిపిస్తుంటార‌నే ప్ర‌చారం కూడా ఉంది. అస‌లు ఎవ‌రా కాంట్ర‌వ‌ర్సీ స‌న్యాసిని ? ఆమె క‌థ ఏంటి ? అనేవి ఆసక్తిక‌ర విష‌యాలు.

ఈ కాంట్ర‌వ‌ర్సీ స‌న్యాసిని పేరు రాధేమా. కానీ, ఆమె అస‌లు పేరు సుఖ్వింద‌ర్ కౌర్‌. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డొరంగ‌ల గ్రామం ఆమెది. 17వ యేట‌నే ఆమె వివాదం జ‌రిగింది. పుట్టినింటి వారిది, మెట్టినంటి వారిది సాధార‌ణ కుటుంబాలే. 20వ సంవ‌త్స‌రం వ‌ర‌కు సుఖ్వింద‌ర్ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి. ఆమె భర్త బ‌తుకుదెరువు కోసం విదేశాల‌కు వెళ్లారు. దీంతో కుటుంబ‌పోష‌ణ కోసం ఆమె అనేక క‌ష్టాలు ఎదుర్కొంది.

టైల‌ర్‌గా ప‌ని చేసి కొన్నాళ్లు జీవ‌నం సాగించింది. ఆమెకు 23 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు ప‌ర‌మ‌హంస డేరాకు వెళ్లింది. పంజాబ్‌, హ‌ర్యాణాలో డేరాలుగా పిలిచే ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కువ‌గా ఉంటాయి. ప‌ర‌మ‌హంస డేరా వెళ్లిన సుఖ్వింద‌ర్ కౌర్ అక్క‌డ మ‌హంత్ రామ్‌దీన్‌దాస్ వ‌ద్ద శిష్యురాలిగా చేరారు. అక్క‌డే ఆమెకే ఆయ‌న రాధేమాగా పేరు మార్చారు. ఆమె స‌న్యాసం స్వీక‌రించారు.

క్ర‌మంగా రాధేమాగా డేరాకు వ‌చ్చే భ‌క్తుల‌కు ఆమె ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆమె పేరు త‌ర్వాతి రోజుల్లో డేరా దాటి పంజాబ్ అంత‌టా వ్యాపించింది. త‌న‌కు తాను ఆమె గాడ్‌వుమెన్‌గా చెప్పుకుంటారు. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది కానీ ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ప‌లు వివాదాలు కూడా ఉన్నాయి. ఆమెపై ప‌లు కేసులు కూడా న‌మోద‌య్యాయి.

2015లో ఆమె ఔరంగాబాద్ నుంచి ముంబైకి విమాన‌యాన శాఖ వారి నిబంధ‌న‌లు ఉల్లంఘించి త్రిశూలంతో ప్రయాణం చేసింద‌ని కేసు న‌మోదైంది. ఆ త‌ర్వాత రాధేమా త‌న‌ను లైంగికంగా వేధించింద‌ని హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ డాలీ బింద్ర ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రో మ‌హిళ ఇంటి వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకొని క‌ట్నం కోసం వేధించార‌నే కేసు కూడా రాధేమాపై న‌మోదైంది.

కాగా, 2015లో రాహుల్ ప్ర‌మోద్ మ‌హ‌జ‌న్ అనే వ్య‌క్తి రాధేమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. అందులో రాధేమా అల్ట్రా మోడ్ర‌న్ దుస్తులు ధ‌రించి క‌నిపించింది. ఇవి విదేశాల్లో దిగిన ఫోటోలు. ఈ ఫోటోలు వెలుగులోకి రావ‌డంతో రాధేమా జీవితంలోని మ‌రో కోణం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎప్పుడూ ఎర్ర‌టి దుస్తులు, ఎర్ర‌టి బొట్టు, లిప్‌స్టిక్‌తో క‌నిపించే రాధేమా చాలా విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతార‌నే ప్ర‌చారం ఉంది. హిందీ బిగ్ బాస్ 14లో రాధేమా క‌నిపించ‌డంతో ఆమె గురించి చ‌ర్చ మ‌రోసారి మొద‌లైంది.

Related News