చాలా మందికి జీవితంలో మలబద్ధకం ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా చలికాలంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, వాటితో పాటే ఇతర అనారోగ్యాలు చుట్టుముడతాయి. శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్నిసార్లు వీలుపడదు. ఉరుకులు పరుగుల జీవితంలో సరైన జీవనశైలి లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. కానీ ఇంట్లో ఈ టిప్స్ ను పాటించి మలబద్దకాన్నికేవలం మూడురోజుల్లోనే శాశ్వతంగా వదిలించుకోవచ్చు. అంతేకాదు ఈ టిప్స్ పాటించడం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి
మలబద్దకం సమస్యకు అసలు కారణం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ మోతాదు తక్కువగా ఉండటమే. ఉదయాన్నే రెండు ఖర్జురాలను పాలతో కలిపి తీసుకోవాలి. ఇందులో ఫైబర్ తో పాటుగా మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇలా మూడు రోజుల పాటు తీసుకోవడం వల్ల మలబద్దకం వెంటనే తగ్గిపోతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వలన కడుపు శుభ్రంగా ఉంటుంది. జీవక్రియ సక్రమంగా ఉండేలా చేస్తుంది. తేనెలో ఎండు ఖర్జురాలను వారం రోజుల పాటు నిల్వ చేసి ఉంచుకుని వాటిని తినడం వల్ల కూడా ఈ సమస్య తీరిపోతుంది.
ఇలా చేయడం వల్ల రక్తనాళాలు వెడల్పు అయి గుండె జబ్బులు దూరమవుతాయి. బీపీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. నిద్ర పట్టని వాళ్లు రాత్రివేళ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలు… చక్కటి నిద్ర పడుతుంది. గ్యాస్ అసిడిటీ సమస్య తీవ్రంగా వేధిస్తున్నవారు అప్పటికప్పుడు ఒక గ్లాసు నీటిని మరిగించి తాగాలి. ఒకేసారి కాకుండా ఈ నీటిని కొద్దీ కొద్దిగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వెంటనే పొట్టలో గ్యాస్ సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుంది.