logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలోకి ఆ సీనియర్ నేత?

కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన బీజేపీలో చేరనున్నట్టుగా సమాచారం. ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న జానారెడ్డి బీజేపీ ముఖ్య నేతల మధ్య కాషాయపు కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. ఈ నేపథ్యంలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయించడానికి బండి సంజయ్ పావులు కడుపుతున్నట్టుగా సమాచారం. ఈమేరకు రఘువీర్ కు బీజేపీ టికెట్ ఆఫర్ చేసిందని, కొందరు నేతలు ఇప్పటికే ఈ విషయంపై సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తుంది.

అయితే తన తండ్రితో చర్చించిన అనంతరం రఘువీర్ తన నిర్ణయాన్ని చెప్పనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదే విషయమై డీకే అరుణ కూడా జానా రెడ్డితో చర్చించనున్నారట. జానారెడ్డి కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహ రెడ్డి మరణంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఈ నియోజకవర్గం నుంచి గతంలో 9 సార్లు జానా రెడ్డి బరిలో నిలవగా ఏడు సార్లు గెలిచారు. దీంతో ఈసారి కూడా జానా రెడ్డినే కాంగ్రెస్ రంగంలోకి దింపుతుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో జానారెడ్డి ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Related News