logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

కాంగ్రెస్‌కు షాక్‌.. కేసీఆర్‌, కేటీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్ర‌శంస‌లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి షాక్ ఇచ్చారు. ఒక వైపు క‌రోనాను ఎదుర్కోవ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల లెక్క‌ను ప్ర‌భుత్వం దాచిపెడుతోంద‌ని, త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తోంద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. టెస్టులు స‌రిగ్గా చేయ‌డం లేద‌ని, క‌నీసం వైద్య స‌దుపాయాలు కూడా స‌రిగ్గా అంద‌డం లేద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కానీ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మాత్రం ఇందుకు విరుద్ధంగా కామెంట్స్ చేశారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌రిపాల‌న‌లో కోవిడ్‌ను ప్ర‌భుత్వం బాగా నియంత్రిస్తోంద‌ని కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం గొప్ప ఆరోగ్య సంరక్ష‌ణ‌, త‌గినన్ని ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేసింద‌ని ఆయ‌న అన్నారు. కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఒకేసారి ఇలాంటి కామెంట్స్ చేయడం కాంగ్రెస్ నేత‌ల‌నే ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. కాగా, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కుటుంబం కార్పొరేట్ ఆసుప‌త్రులు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related News