logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?

పాశ్చాత్య దేశాలు చాలా విష‌యాల్లో అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. కానీ, కొన్ని విష‌యాల్లో ఈ దేశాల వైఖ‌రి మ‌రీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటుంది. అడ్వాన్స్డ్‌గా ఉండ‌టం వ‌ర‌కు ఓకే కానీ మ‌రింత ఇంత అవ‌స‌ర‌మా ? అనేలా ఆయా దేశాల్లో నిర్ణ‌యాలు ఉంటాయి. తాజాగా అమెరికాలోని షికాగోలో తీసుకున్న ఒక నిర్ణ‌యం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఐదో త‌ర‌గ‌తి, ఆ పైన చ‌దివే విద్యార్థుల‌కు ఉచితంగా కండోమ్‌లు అందుబాటులో ఉంచాల‌ని షికాగో ప‌బ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేష‌న్ బోర్డు(సీపీఎస్‌బీ) ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అది కూడా స్కూళ్ల‌లోనే పిల్ల‌ల‌కు అందుబాటులో కండోమ్‌లు ఉంచాల‌ని నిర్ణ‌యించింది. త‌మ నిర్ణ‌యాన్ని ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే అమ‌లు చేయాల‌ని ఈ బోర్డు ప‌రిధిలో ఉన్న 600 స్కూళ్ల‌ను ఆదేశించింది.

ఎలిమెంట‌రీ స్కూళ్ల‌లో 250, హైస్కూళ్ల‌లో 1000 కండోమ్‌లు విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచాల‌ని ఈ బోర్డు పాఠ‌శాల‌ల‌కు సూచించింది. పైగా ఈ ప‌నికి షికాగో ఆరోగ్య శాఖ కూడా త‌న వంతు స‌హ‌కారం అందిస్తోంద‌ట‌. పాఠ‌శాల‌ల‌కు కావాల్సిన కండోమ్‌లు షికాగో ఆరోగ్య శాఖ‌నే స‌ర‌ఫ‌రా చేయ‌నుంది. కేవ‌లం పిల్ల‌ల‌కు కండోమ్‌లు అందించ‌డం మాత్ర‌మే కాదు సెక్స్ ఎడ్యుకేష‌న్‌కు సంబంధించి కూడా విద్యార్థుల‌కు బోధించాల‌ని నిర్ణ‌యించారు.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిర్ణ‌యాలు తీసుకునే హ‌క్కు అంద‌రికీ ఉంటుంద‌ని సీపీఎస్ బోర్డు చెబుతోంది. కాబ‌ట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన వ‌న‌రులు కూడా ఉండాల‌ని, అందుకే తాము కండోమ్‌ల‌ను అందుబాటులో ఉంచుతున్నామ‌ని వాదిస్తోంది. కండోమ్‌లు అందుబాటులో లేక‌పోతే లైంగిక వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, అవాంఛిత గ‌ర్భాలు వ‌స్తాయ‌ని, అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకే స్కూళ్లలో కండోమ్‌లను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు పేర్కొంటోంది.

అయితే, 5వ త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు కండోమ్‌లే అందుబాటులో ఉంచాల‌నే నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. 5వ త‌ర‌గ‌తి చ‌దివే పిల్ల‌లు 10, 11వ త‌ర‌గ‌తులు మాత్ర‌మే ఉంటారు కాబ‌ట్టి వీరికి కండోమ్‌లు ఇవ్వ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. త‌ల్లిదండ్రులు కూడా ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. కొంద‌రు మాత్రం ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తుతున్నారు.

Related News