logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

ఎన్ని చేసినా బరువు తగ్గకపోవడానికి ఇదే కారణం!

ఈరోజుల్లో అధిక బరువు అనేది చాలా మందికి పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఎలాంటి ఫలితం ఉండదు. ఇలాంటి వారు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లే అందుకు కారణం. బరువు తగ్గడానికి ముందుగా అవసరమైంది సెల్ఫ్ కంట్రోల్, క్రమ శిక్షణ. ఈ రెండు లేకుంటే ఎంత ప్రయత్నించినా సరైన ఫలితాలను అందుకోలేరు. చాలా మంది ఈ విషయంలో చేసే పొరపాట్లు కొన్ని ఉన్నాయి అవేంటో తెలుసుకుంటే బరువు తగ్గడం చాలా సులభం.

చాలా ఎక్కువ బరువు ఉన్నవారు రన్నింగ్, జాగింగ్ చేస్తారు. అయినా బరువు తగ్గడం లేదని బాధపడుతుంటారు. తేలికపాటివి కాకుండా బాడీలో క్యాలరీలను కరిగించే వ్యాయామాలు చేసినప్పుడే ఎక్కువ ఫలితం ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్, జిమ్ లాంటి కఠినమైన వ్యాయామాల వల్ల శరీరంలో జీవక్రియలు వేగంగా పని చేసి తొందరగా బరువు తగ్గుతారు.

బరువు తగ్గాలనే అతృతతో చాలా మంది ఒకపూట భోజనం మానేస్తుంటారు. నిజానికి ఇది మంచిది కాదు. భోజనం మానేస్తే అరుగుదల శక్తి తగ్గిపోతుంది. దాంతో క్యాలరీలు తొందరగా బర్న్ అవ్వవు. అంతేకాదు ఒకపూట ఆకలితో ఉండటం వల్ల రెండో పూట ఎక్కువగా తినేస్తారు. ఇదీ మరింత బరువు పెంచుతుంది.

కొవ్వు పదార్థాలు తినడం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతామని అపోహ పడుతుంటారు. అది నిజం కాదు ఫ్యాటీ ఫుడ్ కన్నా చక్కర వల్లే ఎక్కువ బరువు పెరుగుతారు. కొవ్వు తక్కువగా ఉన్న పదార్థాలలో సహజంగానే చక్కెర ఎక్కువగా ఉంటుంది. లో- ఫాట్ ఫుడ్స్ లోని చక్కర ను శరీరం స్టోర్ చేసుకుంటుంది. అందువ్ల తిన్న వెంటనే ఆకలి వేయడం గమనించవచ్చు.

భోజనం చేసేటప్పుడు కడుపు నిండింది అన్న సంకేతాలు మెదడుకు వెళ్లాలంటే దాదాపు 20 నిముషాలు పడుతుంది. కానీ చాలా మంది త్వరగా తినేస్తుంటారు. తొందరగా తినడం వల్ల మనకు కడుపు నిండిన విషయం మెదడుకు చేరేలోపే ఎక్కువగా తినేస్తాం. కాబట్టి భోజనాన్ని నిదానంగా తినాలి.

సరిగా నిద్రపోకపోయినా బరువు పెరుగుతారు. అదెలా అంటే.. నిద్ర సరిపోనప్పుడు షుగర్ ను ఇన్సులిన్ గా మారే ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పడు ఆ నిల్వ ఉన్న చక్కర స్థాయిలు కొవ్వుగా మారిపోతాయి. నిద్ర సరిపోకుంటే ఒత్తిడికి గురై ఫాస్ట్ ఫుడ్స్, అన్ సాచ్యురైజ్డ్ జంక్ ఫుడ్స్ వైపు మనసు మళ్లుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.

బరువు తగ్గాలనుకునేవారు చిన్న ప్లేటులో భోజనం చేయండి. పెద్ద ప్లేటులో తింటే మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తాం. ఆహార పదార్థాలలోనే కాదు మనం రోజు తీసుకునే టీ, కాఫీలు, జ్యుసులు, సోడా కలిపిన పానీయాల్లో కూడా క్యాలరీలు ఉంటాయి. కానీ వాటిని మనం అంతగా పట్టించుకోము. ఇక బీరు, వైన్లు, సిగరెట్లు తాగేవారు కూడా ఎన్ని చేసినా బరువు అదుపులో ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి.

Related News