logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

సినీ నటుడు పృథ్వీ రాజ్ కు తీవ్ర అస్వస్థత..!

తెలుగు సినీ నటుడు, కమెడియన్ పృథ్వీ రాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని పృథ్వీ స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. గత 10 రోజులుగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టుగా తెలిపారు. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉండటంతో నిన్న రాత్రి హైద్రాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు.

వీడియోలో మాట్లాడుతున్నంత సేపు పృథ్వీ ఆయాసం, తీవ్రమైన జలుబుతో కనిపించారు. ప్రస్తుతం శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. కాగా కోవిడ్ పరీక్షలు, సిటీ స్కాన్ కూడా చేయించానని.. కరోనా నెగిటివ్ అని వచ్చినా కరోనా లక్షణాలు మాత్రం ఉన్నాయన్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఇలా జరిగే అవకాశం ఉన్నందున తనను 15 పాటు క్వారెంటైన్ ఉండాలని వైద్యులు సూచించారని తెలిపారు.

తాను త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తానని అందుకు ప్రజల దీవెనలు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటున్నాన్నారు. కాగా లాక్ డౌన్ కారణంగా చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైన పృథ్వీ సడలింపుల అనంతరం బయటకు వచ్చారు. కొన్ని షూటింగ్ కార్యక్రమాల్లో కూడా పృథ్వీ పాల్గొన్నారని సమాచారం. అయన క్షేమంగా తిరిగి రావాలని సినీ, రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు.

Related News