logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

వీర జవాను కల్నల్ సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు

భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో పోరాడి ప్రాణాలు వదిలిన కల్నల్ సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీగా స్థానికులు తరలివచ్చారు. సూర్య పేట కేసారంలోని వ్యవసాయ క్షేతరంలో సంతోష్ బాబు అంత్యక్రియలను నిర్వహించారు. బుధవారం ఆయన పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. గురువారం ఉదయం సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది. స్థానికులు స్వచ్చందంగా బంద్ పాటించారు.

భారత్ మాతాకీ జై ..సంతోష్ బాబు అమర్ రహే నినాదాల‌తో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఆర్మీ అధికారుల సూచనలతో అంతిమ యాత్రను నిర్వహించారు. సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఆర్మీ అధికారులు చితి వద్దకు తీసుకు వచ్చారు. వీర జవాను సంతోష్ బాబుకు నివాళిగా జవాన్లు గాలిలోకి మూడు సార్లు తూటాలు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. కోవిడ్ నిబంధనల కారణంగా అతి తక్కువ మందికి మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతినిచ్చారు.

భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో మరణించిన 20 మంది భారత సైనికులలో మన రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. అయన మరణించిన విషయాన్నీ ఆర్మీ అధికారులు వారి కుటుంబానికి సమాచారమిచ్చారు. మరో నెల రోజుల్లో హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయ్యి రావలసిన సంతోష్ బాబు ఇంతలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించవల్సి రావడంతో సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దేశం ఒక గొప్ప వీరుడిని కోల్పోయిందని ఆయన తల్లి మంజుల విలపించారు.

Related News