logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఏకంగా కలక్టరేట్ లోనే.. మహిళపై ఐఏఎస్ అధికారి అత్యాచారం

కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అత్యాచారం ఆరోపణలు రావడం జిల్లావ్యాప్తంగ సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని జంగజీర్ ఛాంప్ కలక్టరేట్ లో ఈ దారుణం వెలుగు చూసింది. కలెక్టర్ జనక్‌ ప్రసాద్ పాథక్ తనపై అత్యాచారం చేసారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ప్రతిఘటించడంతో ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను డిస మిస్ చేస్తానని బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడనని బాధిత మహిళ ఆరోపిస్తుంది.

ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ను ఛత్తీస్‌ఘడ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గా బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మే 15వ తేదీన కలక్టరేట్ లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, తనకు అశ్లీల మెసేజిలను పంపాడని 33 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జిల్లా ఎస్పీ పారుల్ మాథుర్ ఈ కేసుపై విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు కలెక్టర్ ను అరెస్టు చేయకపోవడం, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News