logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష.. ఏపీలో కళాశాలలు పునః ప్రారంభం!

కరోనా కారణంగా మూతబడిన కళాశాలలను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత విద్యపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో సెట్ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేసారు. అలాగే అక్టోబర్ 15 నుంచి కళాశాలలు తెరుచుకోనున్నాయి అని వెల్లడించారు.

ఇక అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జరీ చేసారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి కూడా మార్గదర్శకాలు జారీ చేసారు. మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల పాటు అప్రెంటిస్‌షిప్‌ సదుపాయం, ఆపై మరో ఏడాది పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆనర్స్ డిగ్రీ చేపట్టాలన్నారు. తమ ప్రభుత్వం విద్య విధానంలో అభివృద్ధిని సాదించి తీరుతుందన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related News