logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కొబ్బరి నీళ్లు షుగర్ లెవల్స్ ను పెంచుతాయా?

డయాబెటిస్ తో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? షుగర్ లెవల్స్ పెరుగుతాయా? రుచికి తీయగా ఉండటం వలన ఇది చాలా మందికి కలిగే అనుమానం. కొబ్బరి నీళ్లలో మూడు గ్రాముల పీచు పదార్థం, ఆరు గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. ఇవి రెండు చాలా సులభంగా జీర్ణమయ్యేవే. అంతేకాదు చక్కెరను తగ్గించే మెగ్నీషియం ఈ నీళ్ళల్లో పుష్కలంగా ఉంటుంది. అందువల్ల టైపు -2 మధుమేహంతో బాధపడేవారికి, డయాబెటిస్ మొదటి దశలో ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మంచి చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ నీటితో షుగర్ పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. రుచికి తీయగా ఉండే కొబ్బరి నీళ్లలో అసలు తీపి పదార్థమే ఉండదు. ఇందులో కాల్షియం, భాస్వరం, జింక్, మాంగనీస్, ఐరన్, కాపర్, అమైనో ఆమ్లాలు, పొటాషియం, సోడియం లాంటి లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో కొవ్వును నియంత్రించి బరువును అదుపులో ఉంచే గుణాలు ఉంటాయి. షుగర్ ఉండి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది.

ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని సరిగ్గా జరిగేలా చేస్తాయి. తద్వారా షుగర్ ను అదుపులో ఉంచుతాయి. అందుకోసం వీరు తాజా కొబ్బరి నీళ్లను మాత్రమే తీసుకోవాలి. షుగర్ ఉన్నవారు తీయటి నీళ్ల కన్నా వగరుగా ఉండే నీటిని తాగడం ఇంకా మంచిది. అయితే ఏదైనా పరిమితికి మించి తీసుకుంటే వాటి తాలూకు దుష్ప్రభాలు కూడా ఉంటాయి. షుగర్ పేషంట్లు కొబ్బరి నీరు తీసుకోవచ్చు కానీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇందులో 15 శాతం ప్రాక్టోజ్, 50 శాతం గ్లూకోజ్, 35 శాతం సుక్రోజ్ లాంటి సహజ చక్కరలు ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం డయాబెటిస్ బాధితులు రోజుకి 200 మిల్లీ లీటర్ల కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Related News