logo

  BREAKING NEWS

జ‌గ‌న్ షాకింగ్ నిర్ణ‌యం.. ఇద్ద‌రు తెలంగాణ వాళ్ల‌కు రాజ్య‌స‌భ సీటు  |   ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |  

అమరావతి అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష!

తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా మెట్రో పాలిటన్ రీజియన్ ( ఏఎమ్మార్డీయే) అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షించారు.

అమరావతి లో ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణం, వాటి పురోగతి, అభివృద్ధి తదితర అంశాలపై జగన్ అధికారులతో చర్చించారు. ఈ అంశంపై కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్బీసిసి, ఏపీఐఐసి నివేదికలను అందించాయి. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విభజించే ప్రతిపాదనపై అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణతో పాటుగా రూ. 1,450 కోట్ల ఆదాయం వస్తుందని తమ నివేదికలో వెల్లడించాయి. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ. 150 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అమరావతి అభివృధికి కరకట్ట రోడ్డు కీలకమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. విశాఖ తీరంలో 13.59 ఎకరాల స్థలంలో పాజెక్టు ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు.

Related News