logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

మాక్ కాల్స్ చేయాలి… ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి.. జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ట్లు అనుమానం ఉంటే ఏం చేయాల‌ని, ఎవ‌రికి ఫోన్ చేయాల‌ని వంటి విష‌యాల‌పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కోవిడ్ – 19, ఆరోగ్య‌శ్రీపై జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఆరోగ్య శ్రీ గురించి ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్క్‌లు ఉండాలన్నారు. ఆరోగ్య మిత్రలతో ఆ హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని, ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్‌ డెస్క్‌ కచ్చితంగా ఉండాలన్నారు.

ఆరోగ్య‌శ్రీ పథకాన్ని నీరు గార్చేలా వ్యవహరిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశ్రీ అమలుపై ఎప్పటికప్పడు నిశిత పర్యవేక్షణ చేయాలని, ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలని, ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల మీద, వైద్య సేవల నాణ్యత మీద ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు.

ఆరోగ్య మిత్రలకు ప్రోటోకాల్‌పై సంపూర్ణ అవగాహన ఉండాలని, ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా ఇస్తున్నారా? లేదా? అన్నది కూడా వారు చూడాలని పేర్కొన్నారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయన్న దానిపై ఎప్పటికప్పుడు రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని, ఆ సమాచారాన్ని ఆరోగ్య మిత్రలు ఎప్పటికప్పుడు ప్ర‌భుత్వానికి అందించాలన్నారు.

కోవిడ్‌ ఆస్పత్రుపై చేస్తున్న‌ట్లుగానే అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఆ పథకంలో నమోదైన ఆస్పత్రులపై సమీక్ష చేయాలని జ‌గ‌న్ సూచించారు. ఒక ఆస్పత్రిలో రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేన‌న్నారు. రోగులు సంతృప్తి చెందేలా ఆరోగ్యమిత్రలు సేవలు అందించేలా చూడాలని పేర్కొన్నారు. కాల్‌ సెంటర్లకు అధికారులు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి, పర్యవేక్షణ చేస్తున్నారా? లేదా? అని ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. ప్రతిరోజూ అధికారులు మాక్‌ కాల్‌ చేసి, వాటి పని తీరును పరిశీలించాల‌ని సూచించారు. ప్రతి మాక్‌ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలన్నారు.

ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలిక సదుపాయాలపై ప్రశ్నలు వేసి రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని పేర్కొన్నారు. వీటి ద్వారా ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాల‌ని, ఎక్కడైనా వాటిలో లోపాలు గుర్తిస్తే వెంటనే పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆరోగ్య ఆసరా మీద కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. మనం తీసుకుంటున్న చర్యలపై రోగులంతా సంతృప్తి వ్యక్తం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టీచింగ్‌ ఆస్పత్రుల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయన్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల నిర్మాణంపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

Related News