logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కొత్త కార్పొరేటర్లతో కేటీఆర్ కీలక భేటీ.. మేయర్ పదవిపై క్లారిటీ?

గ్రేటర్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ కు కొత్త మేయర్ ఎవరనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. కాగా ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి గులాబీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ తరువాతి స్థానంలో అత్యధిక సీటు సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది.ఎక్స్ అఫీషియో ఓట్లు గెలిచినా టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో సమావేశం కానున్నారు. ఇప్పుడు ఈ అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా మేయర్ పీఠం పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ కు అనధికార మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం తో దోస్తీపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

కాగా టీఆర్ఎస్ తో ఎంఐఎం పొత్తు పై నిన్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ తనకు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి పిలుపు అందలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసందే. అయితే వీలైనంత వరకు ఎంఐఎం పార్టీ మద్దతు లేకుండానే మేయర్ పీఠాన్ని చేపట్టాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Related News