దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఆందోళనలు 11 వ రోజుకు చేరుకున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్చలు ఇంకా కొలిక్కి లేకపోవడంతో మరికొన్ని రోజులు ఈ ఆందోళనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. ఢిల్లీ రైతులకు తన మద్దతును ప్రకటించారు. కేంద్రం తీరును నిరసిస్తూ రైతులు చేపట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలంటూ కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారత్ బంద్ ను విజయవంతం చేయడానికి తమ పార్టీ కృషి చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఓ ప్రకటనను విడుదల చేసారు. రైతుల పోరాటం న్యాయమైనది అని వారి డిమాండ్స్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా రైతులతో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. శనివారం 40 మంది రైతు సంఘాల నేతలతో 4 గంటల పాటు చర్చించారు. వ్యవసాయ చట్టాల రద్దుకే రైతు సంఘాలు పట్టుబట్టడంతో ఈ చర్చలు ఎటూ తేలకుండానే ముగిసాయి.