logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కేసీఆర్ భేటీ.. కొత్త ఎయిర్పోర్టులపై చర్చ!

రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేకర్ రావు పౌరవిమానయాన శాఖ, హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ప్రాజెక్టు విషయమై సీఎం కేసీఆర్ చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిధుల విడుదలపై చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వాలని కోరారు. సిద్ధిపేట, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. అలాగే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించినందుకు కేసీఆర్ కృతఙ్ఞతలు తెలిపారు.

పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై కేసీఆర్ చర్చించారు. అలాగే జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ ను కలిసిన కేసీఆర్ నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగం పై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ అయ్యారు.

 

Related News