శనివారం ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. అందుకోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో రానున్నారు. ఈ నేపథ్యంలో హకీమ్ పెట్ ఎయిర్ పోర్టులో ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రానున్నారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పిఎంవోకు సమాచారం పంపింది. కాగా అందుకు పీఎంవో కార్యాలయం స్పందిస్తూ.. ప్రధాని రాక సందర్భంగా కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతినిస్తున్నట్టుగా పేర్కొంది.
సీఎం కేసీఆర్ రావలసిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ సీఎం సోమేశ్ కుమార్ కు ఫోన్లో సమాచారం పంపినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానికి స్వాగతం పలకడానికి హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాత్రమే రావాలని ప్రధాని కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.