logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కల్నల్ సంతోష్ బాబు ఇంటికి సీఎం కేసీఆర్..!

భారత్ – చైనా సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. నేడు సూర్యాపేటలోని సంతోష్ బాబు నివాసానికి చేరుకున్న కేసీఆర్ సంతోష్ బాబు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సీఎం ముందుగా ప్రకటించిన విధంగా సంతోష్ బాబు సతీమణి సంతోషికి గ్రూప్ -1 స్థాయి ఉద్యోగానికి సంబంధించి నియామక పత్రాలను అందజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కేటాయించిన 711 గజాల స్థలానికి సంబందించిన పత్రాలను అందజేశారు. రూ. 5 కోట్లలో రూ. 4 కోట్ల రూపాయలను సంతోష్ భార్య సంతోషికి, రూ. 1 కోటి రూపాయల చెక్కును సంతోష్ తల్లిదండ్రులకు అందజేశారు.

ఈ నెల 15న చైనా బలగాలతో వీరోచితంగా పోరాడిన కల్నల్ సంతోష్ బాబు తలకి రాయి తగలడంతో పక్కనే ఉన్న గాల్వాన్ నదిలో పడిపోయారు. అత్యంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితుల మధ్య తీవ్ర గాయాలతో, గడ్డకట్టుకుపోయిన చలిలో సంతోష్ బాబు తుది శ్వాస విడిచారు. సంతోష్ బాబు మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోష్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మన సైనికుల ప్రాణత్యాగాలకు ప్రతీకారంగా చైనాపై కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా తెలంగాణ ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. అదేవిధంగా ఈ ఘర్షణల్లో సంతోష్ బాబుతో పాటు అమరులైన 19 మంది జవాన్ల కుటుంబాలకు కూడా రూ. 10 లక్షల చొప్పున నగదును కేసీఆర్ ప్రకటించారు.

Related News