logo

  BREAKING NEWS

ఇంటర్ విద్యలో కీలక మార్పులకు ఏపీ సర్కార్ ఆదేశాలు!  |   కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |  

360 డిగ్రీల పర్సనాలిటీ పీవీ నరసింహారావు: కేసీఆర్

దివంగత మాజీ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు శాత జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. పీవీ జ్ఞాన భూమి వద్ద కేసీఆర్ ఆయన చిత్ర పఠానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రావు, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పీవీ నరసింహ మన దేశానికి అందించిన సేవలను స్మరిస్తూ ఏడాది పాటు తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానిస్తూ .. దశాబ్దాలుగా ఆయనకు దక్కవలసిన గౌరవం దక్కలేదు. ఆయన దేశానికి చేసిన సేవలు చరిత్ర మరవదు. దేశం ఆర్థిక సమస్యలతో కుటుపడుతున్న సమయంలో పీవీ దేశ ఆర్థిక ప్రగతిని ఉరుకులు పెట్టించారు. ఈరోజు మనమందరం ఇంతటి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాం అంటే అది ఆయన కారణంగానే. ప్రధాని పదవి ఆయనను స్వయంగా వరించి వచ్చింది.

విద్యాశాఖ పేరును హెచ్‌ఆర్‌డీగా మార్చింది ఆయనే. జైళ్ల శాఖలో కూడా అనేక సంస్కరణలు తెచ్చారు. ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే భూసంస్కరణలు తెచ్చారు. అందుకోసం అయన కొన్ని వందల ఎకరాల సొంత భూములను దానం చేసారు. గురుకుల పాఠశాలల, నవోదయ పాఠశాలలు ప్రవేశపెట్టారు. చివరకు మత్య్స శాఖ అప్పగించినా అక్కడ కూడా సంస్కరణలు తేగలనని చెప్పిన వ్యక్తి ఆయన. పీవీ వ్యక్తిత్వాన్ని కీర్తించడానికి మాటలు చాలవు. 360 డిగ్రీల వ్యక్తిత్వం ఆయనది.

ప్రపంచ దేశాలన్నీ ఆసియా వైపు చూసేలా చేసారు. దేశానికి అయన ఎంతో గొప్ప సందేశమిచ్చారు. కానీ ఆయనకు దక్కాల్సిన గౌరవం ఎప్పుడూ లభిచలేదు. ఇది సందర్భం కాదు కానీ అవసరం వచ్చినప్పుడు వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. 50 దేశాల్లో పీవీ శత జయంతి వేడుకలను అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు మనసుకు చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉంది. పీవీ తెలంగాణా ఠీవి అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Related News