logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ఆశ్చ‌ర్యం.. ఏపీ రైతుకు కేసీఆర్ ఫోన్‌.. భోజ‌నానికి ఆహ్వానం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసే కొన్ని ప‌నులు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ముఖ్య‌మంత్రి హోదాలో ఏ విష‌యం తెలుసుకోవాల‌న్నా గంట‌ల వ్య‌వ‌ధిలో ఆయ‌న రిపోర్టులు తెప్పించుకోవ‌చ్చు. ఉన్న‌తాధికారులు, ఇంటెలిజెన్స్‌ను ఆదేశించి కావాల్సిన వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. కానీ, ఆయ‌న ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తారు. క్షేత్ర‌స్థాయిలోని ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగుతారు.

ఇటీవ‌ల ఆయ‌న రైస్ మిల్ నిర్వాహ‌కుల‌కు, రైతుల‌కు, గ్రామ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శికి, స‌ర్పంచ్‌ల‌కు ఫోన్‌లు చేసి అనేక మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. తాజాగా ఆయ‌న ఒక రైతుకు ఫోన్ చేశారు. తెలంగాణ రైతుకు ఫోన్ చేయ‌డం పెద్ద ఆశ్చ‌ర్య‌మేమీ కాదు కానీ కేసీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఒక రైతుకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. కారు పంపిస్తా.. భోజ‌నానికి రావాల‌ని ఆహ్వానించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణ జిల్లా ఘంట‌సాల మండ‌లం ఘంట‌సాల‌పాలేనికి చెందిన ఉప్ప‌ల ప్ర‌సాద‌రావు ఆద‌ర్శ‌రైతు. ఆధునిక ప‌ద్ధ‌తుల్లో వ్య‌వ‌సాయం చేస్తూ మంచి దిగుబ‌డులు సాధిస్తుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వ్య‌వసాయ ప‌ద్ధ‌తుల‌ను, యంత్రాల‌ను ఉప‌యోగిస్తూ తోటి రైతుల‌కు ప‌రిచ‌యం చేస్తుంటారు. ఇటీవ‌ల ఆయ‌న సీడ్రిల్ ఆధునిక వ్య‌వ‌సాయ యంత్రాల‌ను ఉప‌యోగిస్తున్నారు.

వీటి ద్వారా వెద ప‌ద్ధ‌తిలో త‌న‌కున్న 35 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమిలో స‌న్నాల ర‌కం వ‌రి సాగు చేస్తూ మంచి దిగుబ‌డి సాధిస్తున్నారు. తెలంగాణ‌లో స‌న్నాల ర‌కం వ‌రి సాగును ప్రోత్స‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు గానూ ఆయ‌న వివిధ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తులు, యంత్రాల గురించి అన్వేషిస్తుండ‌గా కృష్ణా జిల్లా రైతు ఉప్ప‌ల ప్ర‌సాద‌రావు గురించి తెలుసుకున్నారు.

వెంట‌నే ఆయ‌న ఫోన్ నెంబ‌ర్ తెలుసుకొని నేరుగా ఫోన్ చేశారు. కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ రాగానే రైతు ప్ర‌సాద‌రావు ఆశ్చ‌ర్య‌పోయారు. రైతు బాగోగులు తెలుసుకున్న కేసీఆర్ సీడ్రిల్ యంత్రాలు, వెద ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప‌ద్ధ‌తి ద్వారా ఎక‌రానికి 40 – 45 బ‌స్తాల దిగుబ‌డి సాధించాన‌ని కేసీఆర్‌కు ప్ర‌సాద‌రావు వివ‌రించారు.

ఈ ప‌ద్ధ‌తి తెలుసుకొని కేసీఆర్ ఆస‌క్తి క‌న‌బ‌రిచిన‌ట్లు తెలుస్తోంది. రైతు ప్ర‌సాద‌రావును త‌న ఇంటికి భోజ‌నానికి రావాల్సిందిగా కేసీఆర్ కోరారు. కారు పంపిస్తాన‌ని, వీలు చూసుకొని రావాల‌ని కోరారు. కేసీఆర్ నుంచి ఫొన్ రావ‌డంతో ఆద‌ర్శ రైతు ఉప్ప‌ల ప్ర‌సాద‌రావును తోటి రైతులు అభినందించారు.

Related News