logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనా తీవ్రం.. మళ్ళీ లాక్ డౌన్ విధించే యోచనలో కేసీఆర్

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ రోజుకి వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా హైదేరాబద్ నగరంలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నయ్యి. ఈ నేసథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నాలుగు రోజుల్లోగా కరోనా వ్యాప్తిని అరికట్టేం వ్యూహాన్నిఅమలు చేయాలని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిచారు.

వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలోను కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తక్కువే అని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా రోగుల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో బెడ్లు సిద్ధం చేశామన్నారు.

లక్షణాలు లేని వారికీ ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ రోగులను గుర్తించేందుకు భారీగా కరోనా పరీక్షలు చేపడుతున్నామని వెల్లడించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి జీహెచ్ ఎంసీ పరిధిలో మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఈటెల ముఖ్యంమత్రికి వివరించారు.

ఈ అంశంపై కేసీఆర్ స్పందిస్తూ..’కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ వంటి నగరంలో కరోనా కేసులు పెరగడం సహజం. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే చెన్నై వంటి నగరాల్లో కరోనా వ్యాప్తిని నిరవించడానికి మళ్ళీ లాక్ డౌన్ విధించారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని కోరుతున్నారు. కానీ మళ్ళీ లాక్ డౌన్ విధించడం అంత తేలికైన విషయం కాదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేయాలి. అదే విషంగా క్యాబినెట్ ను సమావేశ పరిచి అందరి సూచనలను తీసుకోవలసి ఉంటుంది. దీనిపై క్షుణ్ణంగా పరిశిలిస్తాము. అవసరమనుకుంటే రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Related News