logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

దుబ్బాక లెక్క కాదు.. అసలు ఆట ఇప్పుడే షురూ ఐతది: కేసీఆర్

గ్రేటర్ ఎన్నికల్లో వంద శాతం సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో మొత్తం 200 మంది పాల్గొన్నారు. వీరితో కేసీఆర్ 500 బృందాలను ఏర్పాటు చేసి పలు కీలక సూచనలు చేసారు.

మొదట దుబ్బాక ఓటమి ఫలితాలను నేతలు, కార్యకర్తలు మైండ్ లో నుంచి తీసేయాలన్నారు. దుబ్బాకలో గెలుపు కాదు అసలైన ఆట ఇప్పుడే మొదలు పెట్టనున్నామన్నారు. ఈ దెబ్బతో హైద్రాబాద్ గడ్డపై గులాబీ జెండా.. గోల్కొండ కోటపై కాషాయం కాదు జాతీయ జెండాను ఎగురవేస్తామన్నారు.

రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పోరాడాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలను వివరించారు. సోషల్ మీడియాలో, ఇతర వేదికలపై తమపై జరిగే అసత్య ప్రచారాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వీధివీధికి, గడప గడపకు పార్టీ ప్రచారం జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విజయం మనదే కావాలని దిశానిర్దేశం చేసారు.

Related News