logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘కరోనా వచ్చినా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళకండి’

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి అదనంగా రూ. 100 కోట్లు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి ఉందని కొంత కాలంగా ప్రతి పక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల విషయంలో ఎలాంటి అలసత్వం లేదన్నారు. ఈ మేరకు ఆయన ప్రగతి భవన్ లో శుక్రవారం కరోనా పై సమీక్ష నిర్వహించారు.

కరోనాను ఎదుర్కోవడంలో మొదట కేంద్ర ప్రభుత్వమే గందరగోళంగా వ్యవహరించేదని అన్నారు. కానీ రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా వైద్య సేవలతో సిద్ధంగా ఉందన్నారు. అర్థం పర్థం లేని విమర్శలను ప్రభుత్వం పట్టించుకోదన్నారు. ప్రజలు కరోనా వస్తే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.

అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఉచిత వైద్యం తీసుకోవచ్చన్నారు. కరోనా రోగుల ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అన్ని సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. ఒక్క గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లోనే అదుపు 3000 పడకలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల పడకలు కోవిడ్ బాధితుల కోసమే ఉన్నాయన్నారు. 1500 వెంటిలేటర్లు, అవసరమైన పీపీఈ కిట్లు ఉన్నాయన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అన్ని వర్గాల వారికి సమానంగా వైద్యం అందాలన్నారు. పడకలు లేవని కృత్రిమ కొరత సృష్టించే ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఆసుపత్రిలో కోవిడ్ బాధితుల కోసం ఎన్ని పడకలు ఉన్నాయి? ఎన్ని ఖాళీగా ఉన్నాయి? తదితర విషయాలను బహిరంగంగా తెలపాలన్నారు. తాజాగా జనరల్ బడ్జెట్ కు అదనంగా కేటాయించిన నిధులను ఆరోగ్య మంత్రి, సీఎస్ కరోనా పై తక్షణ చర్యలు తీసుకోవడానికి 100 కోట్ల నిధులు అందుబాటులో ఉంచుతామన్నారు.

Related News