logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

విద్యార్థులకు శుభవార్త.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన!

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యను అందించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం పలు అంశాలపై అధికారులతో చర్చ జరిపిన అనంతరం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కాగా రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన కళాశాలలను ఆగస్టు నెల నుంచి ప్రారంభించాలని నిన్న విద్యా శాఖపై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు కేసీఆర్ ప్రగతి భవన్ లో అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అన్ని ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు భోజన వసతి లేక మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోతున్నారని దీని వల్ల ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోతున్నట్టుగా గుర్తించామన్నారు. అందుకోసం విద్యార్తులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయిచామన్నారు.

జడ్చర్ల డిగ్రీ కాలేజీలో లెక్చరర్ రఘు రామ్ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు భోజనం అందిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకు కేసీఆర్ ఆయనను అభినందించారు. అలాగే కాలేజీ ఆవరణలో విద్యార్థులకు బొటానికల్ గార్డెన్ ను అభివృద్ధి పరిచిన స్థానిక ఎమ్మెల్యే, కాలేజీ ప్రొఫెసర్ సదాశివయ్యలను ప్రశంసించారు. జడ్చర్ల కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో దీనిని అమలు పరచాలన్నారు. జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ కోసం అవసరమైన రూ. 50 లక్షల నిధులను మంజూరు చేసారు. త్వరలోనే వివిధ కాలేజీల్లో బోటనీ లెక్చరర్లతో సమావేశమవుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Related News
%d bloggers like this: