logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్: ఇంతలో ఎంత మార్పు?

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. కానీ ఫలితాలు మాత్రం టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా రాలేదు. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుంది. ఎల్ఆర్ఎస్ రద్దు, నియంత్రిత సాగు విధానం ఎత్తివేయడం, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన ఇలా వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తాజాగా కేసీఆర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఫలితాల అనంతరం కేసీఆర్ ఢిల్లీ పర్యాటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచే కేసీఆర్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. మొన్నటిదాకా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపిన కేసీఆర్ ఆ తర్వాత స్వరం మార్చారు. తాజాగా ఇప్పుడు మరోసారి కేంద్రం తెచ్చిన పథకానికి ఆయన జై కొట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని బీజేపీ నేతలు కేసీఆర్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీని వల్ల రాష్ట్రంలో ప్రజలకు గుండె ఆపరేషన్లు, కరోనా చికిత్స ఉచితంగా లభించడం లేదని వారు ఆరోపించారు. తాజాగా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్టుగా ప్రకటించారు.

ప్రధానితో వీడియో కఫరెన్స్ సందర్భంగా రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రధానికి వెల్లడించారు. గతంలో ఈ పథకం కన్నా తమ రాష్ట్రంలో అమలులో ఉన్న ఆరోగ్య శ్రీ పథకమే ఎన్నోరెట్లు మేలని కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు బీజేపీకి కౌంటర్ ఇచ్చేవారు. కాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరడం గమనార్హం.

2018 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి ఏటా 5 లక్షల మందికి ఆరోగ్య భీమా కల్పిస్తుంది. ఈ పథకం కింద కోవిడ్ -19 చికిత్సతో పాటుగా 1500 రోగాలకు చికిత్సలు చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ తో అనుసంధానించడం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా హైదరాబాద్ లో చికిత్సలు చేయించుకునే అవకాశం ఉంది.

Related News