logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త..!

రాష్ట్రంలో రైతులు నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పిలుపు మేరకు రైతుల నుంచి మద్దతు లభించడం పై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయుయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్యంగా నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించామన్నారు.

ఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేసి సాగు మొదలుపెట్టినట్టుగా అధికారులు సీఎం కు వివరించారు. జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితుల పై సమీక్ష నిర్వహించారు. అనంతరం వ్యవసాయ అధికారులు అందజేసిన వివరాలను పరిశీలించారు. రైతులు పట్టుబడి కోసం ఇబ్బంది పడవద్దని సీఎం సూచించారు. వారం పది రోజుల్లో రైతు బందు సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నామని ప్రకటించారు.

రైతు బంధు ద్వారా వచ్చే డబ్బును ఉపయోగించుకుని రైతులు వ్యవసాయం పనులను ముమ్మరంగా కొనసాగించాలని తెలిపారు. ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సిఎం ఆదేశించారు.

గతంలో రైతులు తమకు నచ్చిన పంటలను సాగు చేసేవారు. ఒకరు వరి, మరొకరు చెరుకు. పసుపు పంటలను పండించుకునేవారు. అయితే వారు పండించిన పంటకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, దళారుల చేతుల్లో మోసపోవడం తదితర కారణాల ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది.

అంటే రైతు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో నిర్దేశిత పంటను పండించవలసి ఉంటుంది. వారు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి మద్దతు ధర చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు నియంత్రిత సాగు ద్వారా పంట పండించే రైతులందరూ ప్రభుత్వం అందించే రైతు బందు పథకానికి అర్హులుగా ప్రభుత్వం తెలిపింది.

Related News