logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

విమర్శలకు చెక్ పెట్టిన కేసీఆర్.. ఫాంహౌస్ నుంచి ప్రగతి భవన్ కు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ముఖ్యంమత్రి కేసీఆర్ కనిపించకుండా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులతో నిర్వహించాల్సిన సమావేశాలు కూడా లేకపోవడం, ప్రగతి భవన్ లో కొంత మంది సిబ్బందికి కూడా కరోనా సోకడంతో కేసీఆర్ కు కూడా కరోనా సోకిందని ఊహాగానాలు వెల్లువెత్తాయి.

పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల అనంతరం నుంచి కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. అయితే దీనిపై విపక్షాలు కూడా ఈ విమర్శలకు మరింత పదును పెట్టాయి. కేసీఆర్ కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం గురించి బయటకు తెలపాలని హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కేసీఆర్ ఎక్కడ? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఊహాగానాలకు తెర దించుతూ తాజాగా కేసీఆర్ తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కు చేరుకున్నారు. రెండు వారాలుగా ఆయన ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. తాజా సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో అయన రైతులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, అభివృద్ధి పనులపై కేసీఆర్ అధికారులతో చర్చలు జరపనున్నారు.

Related News