logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

నేను అదృష్టవంతుడిని.. కొండ‌పోచ‌మ్మ ప్రాజెక్టు వ‌ద్ద కేసీఆర్ భావోద్వేగం

చాలామంది ఉద్య‌మం ప్రారంభించి ఉద్య‌మం ఫలించ‌క‌ముందే మ‌ర‌ణిస్తార‌ని, కానీ తాను చాలా అదృష్టవంతుడిన‌ని, తానే తెలంగాణ ఉద్య‌మాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఉద్య‌మ ఫ‌లితాన్ని కూడా చూస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ త‌న‌తో అన్నార‌ని గుర్తు చేసుకున్నారు. కొండ పోచ‌మ్మ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ఒకప్పుడు “ప‌ల్లెప‌ల్లెనా ప‌ల్లెర్లు మొలిచే తెలంగాణ‌లోనా”, “త‌లాపున పారుతోంది గోదారి మ‌న చేను, మ‌న చెలుక ఎడారి” అనే ఏడుపు పాట‌ల తెలంగాణ నేడు ప‌సిడి పంట‌ల తెలంగాణ‌గా మారుతోంద‌న్నారు.

తెలంగాణ వాళ్ల‌కు తెలివి లేదు, ప‌ని చేయ‌రాదు అని గ‌తంలో అనే వార‌ని, తెలంగాణ ఇంజ‌నీర్లు ఎంత‌టి ప్ర‌తిభావంతులో ఈ ప్రాజెక్టులే నిరూపించాయ‌న్నారు. తెలంగాణ చ‌రిత్ర‌లో కొండ‌పోచ‌మ్మ ప్రాజెక్టు ఉజ్వ‌ల ఘ‌ట్ట‌మ‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది అపూర్వ ఘ‌ట్ట‌మ‌ని పేర్కొన్నారు. సంవ‌త్స‌రానికి ల‌క్ష కోట్ల పంట‌ను పండించే బంగారు తెలంగాణ‌, భాగ్య‌రాశుల తెలంగాణ‌, ప‌సిడి పంట‌ల తెలంగాణ ఆరు సంవ‌త్స‌రాల్లోనే త‌యారుకావ‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. తెలంగాణ రైతాంగానికి అతి త్వ‌ర‌లోనే గొప్ప శుభ‌వార్త చెప్ప‌బోతున్న‌ట్లు తెలిపారు. భార‌త‌దేశంలోనే కాదు ప్ర‌పంచంలోనే ఎక్క‌డా రైతాంగానికి లేని శుభ‌వార్త‌ను అందిస్తామ‌ని చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత భార‌త‌దేశం మొత్తం ఆశ్చ‌ర్య‌పోతుంద‌న్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం కోసం తాము అద్భుత‌మైన రాజ‌నీతిజ్ఞ‌త‌ను అవ‌లంభించామ‌ని, పొరుగు రాష్ట్రాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపామ‌ని, అందుకే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి పొరుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా వ‌చ్చి ఆశీర్వ‌దించార‌ని గుర్తు చేశారు. నియంత్రిత సాగు మాత్ర‌మే కానీ నియంతృత్వ సాగు కాద‌ని అన్నారు. ఈ విధానం ద్వారా దేశానికే తెలంగాణ రైతాంగం ఆద‌ర్శంగా, అద్భుతాలు సృష్టించే, ఆధునిక రైతాంగంగా మారాల‌నేది త‌న క‌ల అని పేర్కొన్నారు. తెలంగాణ‌లో ఉన్న రైతుబందు, రైతుబీమా ప‌థ‌కాలు ప్ర‌పంచంలో ఎక్క‌డా లేవ‌న్నారు.

Related News