logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను.. బీజేపీ, కాంగ్రెస్ కు కేసీఆర్ ఛాలెంజ్

నల్గొండ జిల్లా హయాలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లాపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.

నల్గొండలో ఉన్న 844 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున ప్రకటించారు సీఎం కేసీఆర్. ఒక్క మున్సిపాలిటీకి రూ. 30 లక్షల చొప్పున నిధులను మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు. జిల్లా కేంద్రానికి కూడా రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మిర్యాలగూడకు రూ.5 కోట్లు మిగిలిన మున్సిపాలిటీలకు కూడా రూ.కోటి చొప్పున విడుదల చేస్తామని వెల్లడించారు.

మొత్తం రూ. 186 కోట్ల రూపాయలకు సంబందించిన జీవోను రేపే విడుదల చేయనున్నామని తెలిపారు. గతంలో ఈ నాయకుడు చేయని అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నీటి పారుదల ఎత్తిపోతల పథకాలను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. బీడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు.

బుధవారం తన పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నింటినీ ఒకే సంవత్సరంలో పూర్తి చేసిచూపుతామన్నారు. ఒకవేళ పూర్తి చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని కేసీఆర్ ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ ను ఇతర పార్టీ నేతలు స్వీకరించాలన్నారు.

Related News
%d bloggers like this: