logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

‘దేవుడితో చెలగాటం వద్దు’.. సీఎం జగన్ వార్నింగ్!

ఏపీలో రామతీర్థం ఆలయంలో దేవుడి విగ్రహాలపై జరిగిన దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో హిందూ దేవుళ్ళ విగ్రహాలను టార్గెట్ చేసిన దుండగులు మత విద్వేషాలను రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. కాగా ఈ వరుస ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.

ఈ ఘటనలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులతో సమావేశమైన జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు. దేవాలయాలు విగ్రహాలపై దాడులు దారుణమన్నారు. దేవుడితో చెలగాటం వద్దని.. దేవుడితో పెట్టుకుంటే ఆయనే శిక్షిస్తాడని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని, బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులను ఆదేశించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై జగన్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తామన్నారు. అర్హులకు పథకాలను కట్ చేసే ప్రభుత్వం మాది కాదన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టామన్నారు. పొరపాటున ఎవరికైనా పట్టా అందకపోతే వారిని గుర్తించి పట్టాలు ఇప్పించాలని అధికారులకు సూచించారు. ఎక్కడా కూడా అర్హత ఉండి పట్టా పొందలేదనే మాట వినిపించకూడదని జగన్ ఆదేశించారు. అదే సమయంలోఅనర్హుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Related News