ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృ బాష అంటేనే మన ఉనికి అని, మన అస్తిత్వానికి ప్రతీక అన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలకు జీవన విధానానికి మూలమైన మాతృభాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సీఎం జగన్ ట్వీట్ చేసారు.