logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మానవత్వం మరిచారా.. పలాస ఘటనపై సీఎం జగన్ దిగ్బ్రాంతి.. !

శ్రీకాకుళం పలాస ఘటనపై పెద్ద దుమారమే రేగుతుంది. 70 ఏళ్ల వ్యక్తి కరోనా భారిన పడి మృతి చెందగా అతని అంత్యక్రియలను జేసీబీ సహాయంతో నిర్వహించడం పై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే ఈ ఘటనలో అమానవీయంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. పలాస మున్సిపల్‌ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్ , శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్.రాజీవ్‌ను సస్పెండ్ చేశారు.

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇటీవల అనారోగ్యం తో మరణించాడు. అంతకు ముందే అతనికి జరిపిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నీ అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా అప్పటివరకు మృతదేహం వద్ద ఉన్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేవారు లేకపోయారు. ఈ విషయం శానిటరీ ఇన్స్పెక్టర్ దృష్టికి రావడంతో సిబ్బందికి పీపీఈ కిట్లు తొడిగించి మృతదేహాన్ని జేసీబీతో తరలించారు. ఈ ఘటనపై త్రీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

తాజాగా పలాస ఘటనపై ముఖ్యంమత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ‘కరోనా సోకిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్బ్రాంతికి గురి చేసింది. మానవత్వం చూపాల్సిన సమయంలో కొందరు వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. బాధ్యులపై చర్యలు తీసుకోక తప్పదు’ అంటూ ట్విట్టర్ వేదికగా అధికారులను హెచ్చరించారు.

Related News