logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనా బాధితులకు వైద్యం నిరాకరిస్తే.. జగన్ సంచలన ప్రకటన!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంచలననిర్ణయాన్ని కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాధితులకు వైద్యం నిరాకరించడడం, కరోనాతో మరణించిన బాధితుల అంత్యక్రియల సందర్భంగా వెలుగు చూసిన కొన్ని ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తాడేపల్లి గూడెం లోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణపై సమీక్షా సమావేశం చేపట్టారు.

ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలను జారీ చేసారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాధితులకు వైద్యం నిరాకరిస్తే వారి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కరోనాతో మృతిచెందిన వ్యక్తుల అంత్యక్రియలకు రూ. 15 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. కరోనాతో దీర్ఘకాలం పోరాటం చేయవలసి ఉంటుందని అధికారులు అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

కరోనా నిర్దారణ పరీక్షల కోసం శాశ్వత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలిపారు. అయితే నిర్వహణపై కూడా పలు కీలక ఆదేశాలిచ్చారు. కోవిడ్ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో ప్రజలకు తెలియాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎవరిని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్ళాలి? అనే విషయాలపై వారిని చైతన్య పరచాలన్నారు. అందుకోసం రోడ్లపై కోవిడ్ పై అవగాహన కల్పించే విధంగా విస్తృతంగా హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. కరోనా చికిత్స అందించేందుకు మరిన్ని సౌకర్యాలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో 17 వేల మంది వైద్యులు, 12 వేల మంది నర్సుల సేవలను వినియోగించుకునేలా నియామకాలను చేపట్టనున్నారు. అందుకోసం సిద్ధం చేసిన ప్రణాలికను వివరించారు.కరోనా కష్ట కాలంలో ముందుండి సేవలందిస్తున్న వారికి మెరుగైన వేతనాలు అందించాలని అన్నారు.

అయితే కరోనా రోగులు ఆసుపత్రులకు ఆలస్యంగా రావడం వల్లనే రాష్ట్రలో కరోనా మరణాలు పెరుగుతున్నాయని అధికారులు సీఎం కు వివరించారు. కాగా కంటైన్మెంట్ ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని అధికారులు తెలిపారు. కరోనా కాంటాక్ట్ కేసులను కనిపెట్టేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఒకవేళ కరోనా ఆ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన కూడా ఎక్స్ రేలలో ఏవైనా మార్పులు కనిపిస్తే వారికి కూడా కరోనా పాజిటివ్ గా గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

Related News