logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

ఏపీలో కరోనా కేసులపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం వెల్లడించారు. అయితే అందులో సగానికి పైగా రికవరీ అయినవారేనని పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, సురేష్, సీఎస్, డీజీపీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని భయపడబోమని తేల్చి చెప్పారు. రోజుకు 50 వేలకు పైగా టెస్టులు జరిపే రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. కరోనా పరీక్షలను ఆపే ప్రసక్తే లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో కేసులను తగ్గించి.. కరోనా కేసులను తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఏపీలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఎన్ని కేసుల వచ్చినా రిపోర్టులో స్పష్టమైన సంఖ్య ఉంటుందన్నారు. పాజిటివ్ కేసులను గుర్తించి వారికి వైద్యం అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఎలాంటి కార్పొరేట్ ఆసుపత్రుల లో ఉండే ఎలాంటి ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోయినా మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేశామని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా సోకిన మృతదేహాల అంత్యక్రియలకు బంధువులు, సొంతవారు కూడా హాజరు కాకపోవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. కరోనా మృతదేహాలపై కేవలం గంటల వ్యవధి వరకే ఉంటుందన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వమే వారి అంత్యక్రియలు దగ్గరుండి జరిపిస్తుందన్నారు. కరోనాతో మరణించిన వారి కోసం రూ. 15 వేలు అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు.

కరోనా రావడం పాపం కాదని మధ్య ప్రదేశ్ ముఖమంత్రి కూడా వైరస్ భారిన పడిన విషయం గుర్తు చేసారు. ప్రజలు కరోనాపై ఆందోళన చెందవద్దని.. అవగాహన తోనే కరోనాను జయించవచ్చన్నారు.

Related News