logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

తమిళనాడులో వెలిసిన సీఎం జగన్ పోస్టర్లు

తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్టర్లు వెలిసాయి. ప్రముఖ హీరో విజయ్ అభిమానులు జగన్ ఫోటోలను వినియోగిస్తూ విజయ్ పోస్టర్లను అతికించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలను కొనియాడుతూ అక్కడి మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు విజయ్ అభిమానులు ఏకంగా జగన్ పోస్టర్లను ప్రచారానికి వినియోగించుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో వైఎస్ జగన్ గెలిచినట్టుగా తమ హీరో కూడా రాజకీయాల్లోకి వచ్చి ఘన విజయం సాధించాలని విజయ్ అభిమానులు కోరుకుంటున్నారు. పోస్టర్లపై ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా విజయ్‌ ఘనవిజయం సాధించి తమిళనాడును పాలించేందుకు రానున్నారు’ అంటూ నినాదాలు రాసారు. జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా జగన్ తో కలిసి ఉన్న విజయ్ పోస్టర్లపై ‘రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న ‘సర్కార్‌’’ అని మధురై లోని అభిమానుల సంఘాలు ముద్రించాయి. కుంభకోణంతో పాటుగా మరి కొన్ని చోట్ల ఇలాంటి పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఈ వాల్ పోస్టర్లు ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related News