logo

  BREAKING NEWS

జ‌గ‌న్ షాకింగ్ నిర్ణ‌యం.. ఇద్ద‌రు తెలంగాణ వాళ్ల‌కు రాజ్య‌స‌భ సీటు  |   ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |  

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రం ముందుంచారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 6వ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రత్యేక హోదాపై వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో సహా, నీతి ఆయోగ్ సభ్యులు కూడా హాజరయ్యారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే తమ రాష్ట్రం పారిశ్రామికాబివృద్ది సాధిస్తుందని జగన్ వివరించారు. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తుచేశారు. విభజనకు ముందు బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించారన్నారు.

పీఎఫ్ సి, ఆర్ఈసీ రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 11 శాతం వడ్డీలు చెల్లించాల్సి వస్తుందన్నారు. అదే తయారీ రంగంలో ముందున్న ఇతర దేశాల్లో వడ్డీ రేటు 2 నుంచి 3 శాతానికి మించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. రుణాలపై అధిక వడ్డీలు, విద్యుత్ ఖర్చులు రాష్ట్రానికి భారంగా మారుతున్నాయన్నారు. వ్యవసాయ అనుబంధ సంస్థల్లో ఐదు రకాల చర్యలు అవసరమన్నారు.

పంటల ఉత్పత్తి తగ్గించడం, నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగు మందులను అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. పంటల స్టోరేజి, గ్రేడింగ్, ప్రాసెసింగ్ విధానంలో కూడా కొత్త టెక్నలాజిని అందుబాటులోకి తేవాలన్నారు. రైతుల తమ పంటలను సరైన ధరలకే అమ్ముకునే చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు.

 

Related News