పంచరంగులతో ఆకర్షనీయంగా అంతర్వేది ఆలయం నూతన రథాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు. అంతర్వేది చేరుకున్న సీఎం జగన్ ముందగా ఆలయంలోని లక్ష్మి నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కొత్త ఆలయ రథాన్ని తాడు లాగి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.
కాగా అంతర్వేది ఆలయ రథ నిర్మాణాన్ని జగన్సార్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న అర్థరాత్రి ఆలయ రథం మంటల్లో కాళీ బూడిదైంది. ఈ ఘటనపై భక్తులు, ధార్మిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఈ కేసును ఏపీ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే లక్ష్మీనరసింహ స్వామీ కల్యాణ మహోత్సవం నాటికి కొత్తరథాన్ని నిర్మిస్తామని భక్తులకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈ ఘటన జరిగిన మూడు నెలల వ్యవధిలోనే అంతర్వేది ఆలయానికి కొత్త రథాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్మాణ పనుల కోసంనిపుణులైన గణపతాచారిని నియమించింది. ఆయన ఆధ్వర్యంలో రూ. కోటి 10 లక్షల వ్యయంతో ఆలయానికి కొత్త రథం ముస్తాబైంది. 1450 అడుగుల నాణ్యమైన బస్తర్ కలపను రథం తయారీకి ఉపయోగించారు.
ఈ రథానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 41 అడుగుల ఎత్తు, 7 అంతస్తులతో రథాన్ని తయారుచేసారు. 42 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు తో నిర్మించారు. 6 చక్రాలు ఉండే ఈ రథాన్ని పూర్తి సెక్యూరిటీతో తయారు చేశారు. రథానికి స్టీరింగ్, బ్రేకులు, ఇనుప గేట్లు వంటి వాటిని అమర్చారు.