logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

అమరావతి ఉద్యమంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్రాంతి వేడుకల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండగా నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉందన్నారు. తమ ప్రభుత్వం మహిళా అభ్యుదయంలో మరో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ఇదే వేదికపై 18 నెలల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశామన్నారు. బలహీనవర్గాన్ని బలపరచడంలో మరో అడుగు ముందుకు వేశామన్నారు. వెనకబడిన వర్గాలకు ఇన్ని పదవులు ఇవ్వడం అందులోనూ సగం మంది మహిళల వుండటం ఎక్కడైనా చూసారా? వెనుకబడిన వర్గాలకు ఈస్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదని మన సంస్కృతి, సంప్రదాయాలకు వెన్నుముక అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం బీసీల వెన్ను విరిచిందన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథల్లా భావిస్తుందన్నారు.
ఈరోజు బీసీ కార్పొరేషన్లో సగం మంది మహిళలే ఉండటం గర్వకారణమన్నారు. క్యాబినెట్ లోనూ బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చామని జగన్ పేర్కొన్నారు.

గ్రామ వలంటీర్ల వ్యవస్థలో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారన్నారు. ప్రతి అర్హుడు సంక్షేమ పథకాలను అందుకోవాలన్నారు. కార్పొరేషన్లు ప్రజలు, ప్రభుత్వాలకు అనుసంధానంగా నిలవాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందన్నారు. బీసీల కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రూ. 19 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఈ నెల 25 వ తేదీన వైకుంఠ ఏకాదశి. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నట్టుగా సీఎం వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఒక దిగిపోయిన నాయకుడు చెడిపోయిన బుర్రతో ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఈ పరిస్థితులు చూసి చెప్పవచ్చన్నారు. తాను సొంతంగా లాభపడేందుకు ఇన్ సైడర్ ట్రేడింగ్ లు జరిపారన్నారు. అక్కడే రాజధాని పెట్టాలని ముందుగానే నిర్ణయించి గుట్టుచప్పుడు కాకుండా రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేశారన్నారు. ఆ కొన్న భూముల రేట్లు ఎక్కడ పడిపోతాయోనన్న భయంతో ఈరోజు ఒక ఉద్యమం చేస్తానని గగ్గోలు పెడుతున్నారని జగన్ విమర్శించారు.

 

Related News