logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ఏపీ సర్కార్ శుభవార్త.. వారందరి ఖాతాలో రూ. 18,750 జమ..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతే లక్ష్యంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు తాడేపల్లి గూడెంలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని.. అయితే 45–60 ఏళ్ల మధ్యనున్న అక్క చెల్లెళ్లకు ప్రభుత్వ పథకాలేవీ వర్తించలేదనే ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. 25 లక్షల మంది ఖాతాల్లో ఏటా రూ.18 వేల 750 రూపాయల చొప్పున నాలుగేళ్ళ పాటు జమ కానుంది. అయితే వీరికోసం ఏటా పెన్షన్ కింద రూ. 1000 అందించాలని పాదయాత్ర సమయంలో మొదట అనుకున్నామన్నారు. కానీ 45 ఏళ్ల వయసుకే పెన్షన్ ఏమిటని తమను వెటకారం చేశారన్నారు.

అందుకే ఏడాదికి రూ.12వేలు కాదు, రూ.18,750 ఇస్తాం, నాలుగేళ్లపాటు అక్క చెల్లెళ్లను చేయిపట్టుకుని నడిపిస్తాం అని తమ ప్రభుత్వం మరింత ధృడంగా సంకల్పించిందన్నారు. అయితే ఈ దాబును వాడుకోవడానికి ఎలనఁటి షరతులు లేవని స్పష్టం చేసారు. అలాగే పాత అప్పులను జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌ కంబర్డ్‌ ఖాతాలోకి ఈ డబ్బులను జమ చేస్తున్నట్టుగా సీఎం జగన్ పేర్కొన్నారు.

Related News