ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా కార్మిక సంఘం నేతలు ఆయనకు కలిశారు. 14 మంది నేతలతో సుదీర్ఘంగా సమావేశమైన జగన్ స్టీల్ ప్లాంట్ పై అనుకూలంగా బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కార్మికులు సీఎం స్పందన ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చిందని సంతోషం వ్యక్తం చేసారు.
స్టీల్ ప్లాంట్ పై ప్రధానికి లేఖ రాసిన విషయాన్నీ సీఎం జగన్ గుర్తుచేశారన్నారు. గతంలో ఓఎన్ఎండీసీతో గనులతో జరిగిన ఒప్పందంపై పునఃసమీక్ష ఇస్తామని సీఎం చెప్పారు. స్టీలు ప్లాంట్ కోసం కడపలో గాని కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు లో గాని కృష్ణపట్నం లో గాని అవకాశం ఇస్తామన్నారు. దేవుడి ఆశిస్సులతో స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఉద్యమం చేపట్టాలని సీఎం జగన్ కార్మికులకు సూచించినట్లుగా తెలిపారు.