కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీఎం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలను ప్రకటించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. వీరికి పనిలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి.
అందులో ప్రధానంగా మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో పాటుగా ఇంటర్నెట్ అందకపోవడం కూడా ఒకటి. అందుకే మారుతున్న జీవనశైలి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందుకోసం రాష్ట్రంలో ఇంటర్నెట్ విస్తృతిని పెంచాలన్నారు. రానున్న రోజులో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ను అందించనున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇంటర్నెర్, లైబ్రరీ, ఐటీ ఇతర టెక్నాలజీలు అందుబాటులో ఉంచాలన్నారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా వర్క్ ఫర్మ్ హోమ్ చేసే ఉద్యోగస్తుల పెరిగిందని ఇక ముందు కూడా దీనిని ప్రోత్సహించాలన్నారు. గ్రామంలోని ఆర్కేబీలు, సచివాయలయాలను ఇంటర్నెట్ తో అనుసంధానం చేయాలన్నారు. గ్రామంలో ఎవరైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకునే విధంగా వీలు కల్పించాలన్నారు. కొప్పర్తి ఎలక్ట్రిక్ పార్కు ద్వారా భారీగా ఉద్యోగ కల్పన చేపట్టాలన్నారు.