ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు బీఏసీ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. సభ అరగంట ఆలస్యంగా ప్రారంభమైన విషయాన్నీ అచ్చెన్నాయుడు ప్రస్తావించారు.
అందుకు సమాధానంగా సీఎం జగన్ మాట్లాడుతూ..గౌరవ అచ్చెన్నాయుడు ధర్నాల వల్లనే ఆలస్యంగా ప్రారంభమైందని చమత్కరించారు. కాగా తమను టీవీ ఛానెల్ లో చూపించడం లేదని అనడంతో ”ఆరడుగుల ఆజానుబాహులు మీరు కనిపించకపోవడం ఏమిటి? అచ్చెన్నాయుడు ది గ్రేట్” అంటూ సీఎం జగన్ చురకలు వేశారు. సభలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.