logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ఏపీలో 15 రోజులుపాటు ఇళ్ల పండగ: లబ్ధిదారులకు జగన్ మూడు ఆఫర్లు

ఏపీలో ‘నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు’ పేరిట 30. 75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేపడుతున్న విషయం తెలిసిందే. మహిళల పేరిట మరొకొన్ని రోజుల్లో పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల 75 వేల 755 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేపడుతున్నామన్నారు. మొదటి విడతలో 15 లక్షల మందికి రెండో విడతలో 28 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. అయితే సీఎం జగన్ లబ్ధిదారులకు మూడు ఆఫర్లను ఇచ్చారు.

ఒకటి ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడం, రెండోది ప్రభుత్వం సూచించిన ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన సామాగ్రి, లేబర్ చార్జీలతో సహా ఇస్తుంది. లబ్ధిదారులు దగ్గరుండి ఇల్లు కట్టుకోవచ్చు. మూడోది.. నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారులు సొంతంగా కొనుగోలు చేయవచ్చు. దానికి ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. బేస్ మెంట్, పిల్లర్స్, స్లాబ్ ఇలా విడతల వారీగా నిధులను మంజూరు చేస్తుంది.

సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిరవహిస్తామన్నారు. రాష్ట్రంలో 15 రోజులపాటు ఇళ్ల పండుగ జరగబోతుందన్నారు. ఈ పథకం కోసం 66,518 ఎకరాల్లో రూ. 54,940 ఓట్లు ఖర్చు చేసి 30.75 లక్షల ఇళ్లను నిర్మించనున్నామన్నారు.

అలాగే ఈ పథకానికి అర్హులై ఉండి కూడా ఇళ్ల పట్టాలు అందని లబ్ధిదారులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఎవరికైతే ఇళ్ల పట్టాలు అందలేదో వారంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 90 రోజులలోపు అర్హులను గుర్తించి వారికి పట్టాలు అందజేస్తామన్నారు.

గత కొంత కాలంగా ఇళ్ల పట్టాల పామినీకి ప్రతి పక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం జగన్ విమర్శించారు. ఉగాది పండుగ నాడే ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసి ఉండగా అప్పటి నుంచి కోర్టు కేసులు వేస్తూ అడ్డుపడుతున్నారన్నారు. తన పాదయాత్ర సమయంలో ఇల్లు లేని వారి కష్టలు చూసి బాధపడ్డానన్నారు. దేశం ఇంత ముందుకు వెళుతున్నా ఇప్పటికీ సంపాదించిన దాంట్లో 30 శాతం అద్దెలు చెల్లిస్తుండటం చూసి చలించిపోయానన్నారు. రెండు దశల్లో అర్హులైన వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Related News